పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీకి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం జరిగింది. తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.