పొన్నూరు జీబీసీ రోడ్డులోని పరండయ్య కళ్యాణ మండపం సమీపంలో తాగునీటి ప్రధాన పైపు విరిగిపోయింది. దీంతో గురువారం ఉదయం నుంచి వేల లీటర్ల తాగునీరు వృధాగా రోడ్డుపై పారుతోంది. కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సిబ్బంది లీకేజీ స్థలాన్ని పరిశీలించారు. త్వరలో మరమ్మత్తులు చేపడతామని, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెప్పారు.