కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిైన సందర్భంగా గురువారం చేబ్రోలు మండల టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పింఛన్లు పెంపు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలకై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.