ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్

79చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక 16, 17 వార్డుల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులు సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 7 గంటలకే పట్టణంలో60 శాతం పెన్షన్ పంపిణీ జరిగినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్