సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ఆందోళన

68చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ఆందోళన
అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా బుధవారం పొన్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు ప్రాజెక్టు అధికారిణి ఎస్ వెంకటరమణకు కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించాలని, అంగన్వాడి, ఆశ , మధ్యాహ్నం భోజనం, వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం, పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకుడు నిమ్మకూరు రమేష్ బాబు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్