గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణoలో రేపు జరుగు మాలల యుద్ధభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.