గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించి మండల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని ఆయన అధికారులను సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వివిధ శాఖల అధికారులతో పాటు తెదేపా మండల స్థాయి శ్రేణులు పాల్గొన్నారు.