గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేబ్రోలు సచివాలయం సందర్శించి సిబ్బంది పనితీరు పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు