పొన్నూరు మండలంలోని ఆరెమండ గ్రామం బ్రాంచ్ పోస్టాఫీసులో బ్రాంచ్ మాస్టర్ చేతివాటం ప్రదర్శించటం వల్ల లక్షలాది రూపాయలు గోల్ మాల్ అయినట్లు శనివారం అధికారులు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు ఆరెమండ పోస్టాఫీస్ లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేతివాటం ప్రదర్శించి ప్రజ లనుంచి సేకరించిన నగదును పాస్ పుస్తకాల్లో జమ చేయిలేదని తేల్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉందన్నారు.