ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పెట్టుబడులేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం వలన భూమి సారవంతంగా ఉంతుంది అని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె. అమలుకుమారి అన్నారు. బుధవారం నాదెండ్ల మండలంలోని గణపవరం రైతు సేవా కేంద్రం నందు మండల స్థాయి వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు సర్ఫ్ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ శాఖలతో మండల స్థాయి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.