తుళ్లూరు మండలంలోని రాయపూడి సీడ్ రోడ్లో శనివారం రాత్రి పోలీస్ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. ఇదే క్రమంలో లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వాహనదారులను సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. సీడ్ రోడ్లో తరచు అతివేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తప్పక హెల్మెట్లు ధరించాలని వాహనదారులను హెచ్చరించారు.