ప్రభుత్వం జారీ చేసిన 2024-25 ఆర్ధిక సంవత్సరం వడ్డీమాఫీ పై 50% రాయితీ ప్రకటించిందని పొన్నూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సచివాలయ సిబ్బంది సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 30-04-2025 వరకు పొడిగిస్తూ 2025-26 ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు 5% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ రమేష్ బాబు, ఆర్ఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.