గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం బస్ షెల్టర్ (గుంటూరు బస్టాండ్) వద్ద గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పొన్నూరు అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పొన్నూరు అర్బన్ పోలీసులను సమాచారం ఇవ్వాలని వారు కోరారు.