రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి సంధ్యారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, 1బి అడంగల్ ఆధార్ జిరాక్స్ కాపీలతో రైతు సేవా కేంద్రాలలో తమ పేర్లను ఈనెల 20వ, తేదీలోపుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.