కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లుకు నిరసనగా సోమవారం పొన్నూరు నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ దళిత వర్గాలు పొన్నూరు అంబేద్కర్ సెంటర్ లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ముస్లింల వక్ఫ్ బోర్డు బిల్లు ను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులతో పాటు దళిత క్రిస్టియన్ మైనారిటీ పాల్గొన్నారు.