గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం లోని వెంకటేశ్వర నగర్ లో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ప్రారంభించారు. వార్డులో పలువురికి పెన్షన్ అందజేశారు. ఒక్కరోజు నూరు శాతం పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ చేయాలని ఆయన సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్ లబ్ధిదారులందరూ సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండాలని కోరారు.