అంగన్వాడి కేంద్రాల పరిధిలో చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం వలన రక్తహీనత తగ్గి ఆరోగ్యవంతంగా ఉంటారని పొన్నూరు ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్యామల అన్నారు. మంగళవారం 7వ వార్డు డివిసి కాలనీ లో పౌష్టికాహార పక్షోత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు పాలు తాగించాలని సూచించారు. కార్యక్రమంలో పౌష్టికాహార పక్షోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీలు పాల్గొన్నారు.