పెదకాకాని గ్రామం విద్యుత్ కార్యాలయం వద్ద శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. సీపీఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్తు సర్దుబాటు చార్జీల పేరుతో 15,485 కోట్ల భారం ప్రజలపై మోపిందన్నారు.