పొన్నూరు పట్టణం 18వ వార్డులో ఆదివారం డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కుటుంబాలకు నిత్యవసర సరుకులను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.