పొన్నూరులో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

57చూసినవారు
పొన్నూరు పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం పొన్నూరు నిడుబ్రోలు జై భీమ్ సమూహం ఆధ్వర్యంలో డా. బి. ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా కన్వీనర్ అక్కిదాసు జాషువా జై భీమ్ సమూహంతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్