పొన్నూరు: పైపులైను లీకై వృధాగా పోతున్న తాగునీరు

70చూసినవారు
పొన్నూరు: పైపులైను లీకై వృధాగా పోతున్న తాగునీరు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జిబిసి రోడ్డు పరందయ్య కళ్యాణ మండపం వద్ద మున్సిపల్ ప్రధాన వాటర్ పైపు లైను లీకై త్రాగునీరు వృధాగా పోతుంది. గురువారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సిబ్బంది హుటా హుటిన లీక్ అయిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. త్వరలో మరమ్మత్తులు చేపట్టి పట్టణ ప్రజలకు సకాలంలో తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్