పొన్నూరు: రంగు మారి దుర్వాసన వెదజల్లుతున్న త్రాగునీరు

59చూసినవారు
పొన్నూరు: రంగు మారి దుర్వాసన వెదజల్లుతున్న త్రాగునీరు
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలో త్రాగునీరు గత నాలుగు రోజుల నుండి రంగు మారి దుర్వాసన వెదజల్లుతుందని 23వ వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. రంగు మారి దుర్వాసన వెదజల్లడం వలన తాగేందుకు ఇబ్బందికరంగా ఉందని శుక్రవారం ప్రజలు మీడియాకు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి త్రాగునీరును స్వచ్ఛతగా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్