పొన్నూరు: ఈనెల 17న విద్యుత్ అదాలత్

66చూసినవారు
పొన్నూరు: ఈనెల 17న విద్యుత్ అదాలత్
ఈనెల 17వ తేదీన పొన్నూరు శివారులో ఉన్న గోవాడ చౌదరి కళ్యాణ మండపంలో విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పొన్నూరు విద్యుత్ శాఖ డీఈఈ భాస్కరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అదాలత్ సి జి ఆర్ ఎఫ్ చైర్మన్ తో పాటు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు, పరిష్కారం నిమిత్తం సి జి ఆర్ ఎఫ్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డి ఈ ఈ భాస్కరరావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్