పొన్నూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా డ్వామా పిడి వడ్డే శివశంకర్ పాల్గొని మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఒక్కొక్క గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ను వ్యక్తిగతంగా సమీక్ష జరిపారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పని కల్పించాలని ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు.