పొన్నూరులో వక్ఫ్ బిల్లుకు నిరసనగా భారీ ర్యాలీ

51చూసినవారు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల వక్ఫ్ బిల్లుకు నిరసనగా శుక్రవారం నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ వర్గాలు పొన్నూరు అంబేద్కర్ సెంటర్ నుండి భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ముస్లింల వక్ఫ్ బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ జిబిసి రోడ్డు ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్