చేబ్రోలులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

60చూసినవారు
చేబ్రోలులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలంలో ఉన్న పాతరెడ్డిపాలెం గ్రామంలో ఓ ఇంటిలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్టు సమాచారం అందిన గుంటూరు ప్రత్యేక పోలీసు బృందం ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఎవరు నిల్వ చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అనే కోణంలో చేబ్రోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్