పొన్నూరు పట్టణం 22వ వార్డులో శనివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, చేయబోతున్న పనులపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రతి పక్షాలు చేసే అసత్య ఆరోపణలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇది మంచి ప్రభుత్వమని ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు.