పొన్నూరు: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
పొన్నూరు: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీ కాలువలకు శంకుస్థాపన చేశారు. రూ. 15 లక్షలు మండల ప్రజా పరిషత్ నిధులుతో నంబూరు సెంటర్ నుంచి గంగమ్మ గుడి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్