గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ పరిధిలోని యాగంటి అపార్ట్మెంట్ దగ్గర ఉన్న టొబాకో కంపెనీని తరలించాలని గత సోమవారం స్థానిక ప్రజలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. టొబాకో కంపెనీ వలన దుమ్ము, ధూళి వాసన వస్తుందని ప్రజలు తెలియజేశారు. టుబాకో కంపెనీ తరలింపుపై నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామని అధికారులు తెలిపారు.