పెదకాకాని గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్తు లైన్ల మరమ్మత్తులు చేస్తున్నట్లు డి ఈ. పి హెచ్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ కాలనీ, వడ్డెర కాలనీ, వెంగళరావు నగర్, పాతూరు, సుందరయ్య కాలనీ, సదాశివ కాలనీ, యువజన నగర్, వెనిగండ్ల రోడ్డు, వెనిగండ్ల ఏరియా నందు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.