రేపు పెదకాకాని మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

73చూసినవారు
రేపు పెదకాకాని మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
పెదకాకాని మండలం లో రేపు విద్యుత్ మరమ్మత్తుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పెదకాకాని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి పిహెచ్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెదకాకాని, వెనిగండ్ల, నంబూరు, కొప్పురావూరు, నాగార్జున నగర్, ఆగతావరప్పాడు తక్కెల్లపాడు, ఉప్పలపాడు తదితర గ్రామాలలో ఉ. 8: 30 నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.