పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలలో పాముల కలకలం సిబ్బందితోపాటు రోగులను భయపెడుతున్నాయి. వైద్యశాల చుట్టుపక్కల ముళ్ళపోదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాములకు ఆవాసాలుగా మారింది. ప్రతిరోజు వైద్యశాలకు రోగులు వస్తూ విశ్రాంతి కొరకు చెట్ల కింద కూర్చుంటారు. పాములు ఎటునుంచి వచ్చి కాటు వేస్తాయోనని భయపడుతున్నారు. మంగళవారం సిబ్బంది రెండు పాములను గుర్తించి చంపివేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.