గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గo పరిధిలోని పెదకాకాని మండలం ఆచార్యనాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం లేడీస్ హాస్టల్లో భోజనం సాంబార్ లో కప్ప వచ్చిందని భోజనం మానేసి విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. విషయం బయటకు రాకుండా చూసిన ఏఎన్ యూ అధికారుల తీరును నిరసిస్తూ వసతిగృహం వద్ద నిరసన వ్యక్తం చేసి అధికారుల తీరుపై నినాదాలు చేశారు.