పొన్నూరు మండలంలో బుధవారం బ్రాహ్మణ కోడూరు, వెల్లలూరు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి డేగల వెంకట్రామయ్య పాల్గొని మినుము , పెసర , జొన్న , మొక్కజొన్న పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గురించి రైతులతో మాట్లాడారు. కీలక దశలో ఉన్న అన్ని పంటలకు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.