పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జిబిసి రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన భవన యజమానులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ టిడిఆర్ బాండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అభివృద్ధి పనులలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులపై విచారణ చేపట్టాలని అధికారులను కోరుతామన్నారు.