పొన్నూరు నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా సంఘటన జరిగితే దీనిని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు వైసిపి నేతల ప్రయత్నిస్తున్నారని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ లో గొల్ల చౌదరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. ఆ సమయంలో వారు అక్కడేం చేస్తారని ప్రశ్నించారు. కేవలం మాట మాట పెరిగిన సందర్భంలోనే అనుకోకుండా ఈ ఘటన జరిగిందన్నారు.