పొన్నూరు: ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి తహసిల్దార్ హక్

76చూసినవారు
పొన్నూరు: ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి తహసిల్దార్ హక్
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలో మంగళవారం మండల తహసిల్దార్ మహమ్మద్ జియాఉల్ హక్ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాపు పరిధిలోని తెల్ల రేషన్ కార్డుదారులకు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించాలనే డీలర్లకు సూచించారు. ఈ కేవైసీ చేయించుకోవడం వలన బహుళ ప్రయోజనాలను కార్డుదారులు పొందుతారని తహసిల్దార్ తెలిపారు. రేషన్ షాపు పరిధిలో ఈ కేవైసీ ఎన్ని చేశారు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్