గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ఆదివారం రాత్రి అకాల వర్షం ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. చెట్లు విరిగి పడటంతో చందోలు_నిజాంపట్నం వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక యువకులు చెట్లను అడ్డం తీసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అకాల వర్షం గాలులకు తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.