గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పోకూరి బాబురావుకు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. శనివారం ఉదయం బాబురావు కుటుంబం పనులు నిమిత్తం బయటకు వెళ్లిన నేపథ్యంలో విద్యుత్ మీటర్ల వద్ద మంటలు చెలరేగి పూరింటికి అంటుకున్నట్లు తెలిపారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గ్రామ కార్యదర్శి ఘటనపై బాబురావు ఫిర్యాదు చేశారు.