రైతులకు రైస్ మిల్లుల యాజమాన్యానికి వీఆర్వోలు సంధానకర్తలుగా ఉండి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలుకు చేసేందుకు పనిచేయాలని పొన్నూరు తహశీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్కు ఆదేశించారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు, రైస్ మిల్లుల యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు సమావేశంలో మాట్లాడారు. రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును విజయవంతం చేయాలన్నారు. వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.