ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 1న ఆదివారం సెలవు దినం కారణముగా ఒక రోజు ముందుగానే ఈనెల 30న ఉదయం 5:00 గంటల నుండి డోర్ టు డోర్ పింఛను పంపిణీ చేపట్టనున్నట్లు పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పింఛన్ లబ్ధిదారులందరూ శనివారం సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండాలని కమిషనర్ రమేష్ బాబు కోరారు.