పొన్నూరు పట్టణంలో మోహర్రం పండుగ పురస్కరించుకొని ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. చివరి రోజు షహదత్ సందర్భంగా పట్టణంలోని పీర్ల చవిడి (అషూరఖాన) వద్ద నుండి చిన్న షరగతులు, పెద్ద షరగతులతో ఊరేహింపుగా బయలుదేరి పాత పొన్నూరులోని కార్బల వద్దకు చేరి అక్కడ ఫతేహ ఖాని చదివి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఊరేగింపులో మహిళలు, యువకులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.