శలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శీతలమ్మ తల్లి (బొడ్డు రాయి) దగ్గర ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఏరువాక పూర్ణిమ పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతాలతో తల్లికి అభిషేకం చేసి, అనంతరం విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తల్లికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.