రైతు బజార్లో తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలు ప్రారంభం

63చూసినవారు
పొన్నూరు పట్టణంలోని రైతు బజార్లో గురువారం ప్రభుత్వం నిత్యవసరాలు ధరల నియంత్రికరణలో భాగంగా తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయాల కౌంటర్ ను పొన్నూరు మండల తహసిల్దార్ సూర్య నారాయణ సింగ్ ప్రారంభించారు. పేదలకు కందిపప్పు, బియ్యం అందుబాటు ధరలలో ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసరాలను ప్రజలు వినియోగించుకోవాలని తహసిల్దార్ కోరారు. రైతు బజార్ మేనేజర్ నాగమణి తో పాటు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్