గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో బుధవారం తెల్లవారుజామున మినీలారీలో తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని అందిన సమాచారం మేరకు ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. 50 కిలోల చొప్పున 20 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. వట్టిచెరుకూరు మండలం పల్లపాడు నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైపు వెళ్తుండగా ఎస్సై నాగేంద్ర మీడియాకు తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడతామని ఎస్సై వెల్లడించారు.