గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోనీ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వఉంచిన 60 టన్నులు రేషన్ బియ్యం ను ఆదివారం గుంటూరు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. మిల్లులోని ఇంకా బియ్యం ఉన్నట్లు గుర్తించి సమాచారం సేకరిస్తున్నారు. అధికారులు ప్రతిపాడు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.