ప్రతిపక్ష ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదివారం ఉదయం ఒక వీడియో విడుదల చేసి, వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. వైసీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో దళితుల అభివృద్ధి వందేళ్ల వెనక్కి వెళ్లిందన్నారు. దళితులకు చంద్రబాబు ఆపద్బాంధవుడని, ఆయనపై తప్పుగా మాట్లాడొద్దని సూచించారు.