పమిడివారిపాలెం: చెరువులో పడి వ్యక్తి మృతి

82చూసినవారు
పమిడివారిపాలెం: చెరువులో పడి వ్యక్తి మృతి
పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం గ్రామానికి చెందిన ఇరపన కోటేశ్వరరావు(38) బుధవారం గొర్రెలు తోలుకొని వెళ్లి, మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేదు. గురువారం స్థానికులు చెరువులో శవమై తేలిన కోటేశ్వరరావును గుర్తించి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ మధుపవన్ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకొని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్