పెదనందిపాడు: ఉచిత మెగా మెడికల్ క్యాంపు

83చూసినవారు
పెదనందిపాడు మండలంలోని అన్నపర్రులో ఓ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. పరిసర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. క్యాంపులో ఉచితంగా మందులు అందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మెడికల్ క్యాంపులు పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారన్నారు.

సంబంధిత పోస్ట్