పెదనందిపాడు మండలం పమిడివారి పాలెంలో ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం. బుధవారం వీరపణ కోటేశ్వరరావు (45) గేదెలను మేపేందుకు వెళ్లాడు. రాత్రికి ఆయన తిరిగి ఇంటికి రానందున కుటుంబసభ్యులు, బంధువులు వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామ చెరువులో నీటిపై తేలుతూ ఉండడాన్ని గ్రామస్థులు గమనించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు.